ఇప్ప‌ట్లో ఐటీ ఆఫీసులకు వెళ్లి ప‌నిచేసే ఛాన్స్ లేదు.. సర్వేలో వెల్ల‌డి

02-01-2021 Sat 09:36 | National
  • క‌రోనా నేప‌థ్యంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే ప‌ని
  • మార్చి త‌ర్వాత ఆఫీసుల‌కు క్ర‌మంగా వెళ్లే అవ‌కాశం
  • ఈ ఏడాది చివ‌రి నాటికి బాగా పెరిగే ఛాన్స్
  • హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్ వెల్ల‌డి
కరోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఐటీ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు ఇంటి నుంచే ప‌ని చేసే అవ‌కాశం క‌ల్పిస్తోన్న విష‌యం తెలిసిందే. క‌రోనా వ్యాప్తి ఇప్ప‌టికీ త‌గ్గ‌క‌పోవ‌డం, త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండ‌డంతో తిరిగి ఉద్యోగులు కార్యాల‌యాల‌కు వెళ్తారా? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

ఈ నేప‌థ్యంలో  హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) నిర్వ‌హించిన ఓ సర్వేలో ప‌లు విష‌యాలు వెల్లడయ్యాయి. ఐటీ ఉద్యోగులు ఇప్పట్లో పూర్తి స్థాయిలో కార్యాల‌యాల‌కు వెళ్లటం సాధ్యం కాకపోవచ్చని తేలింది. ఇంటి నుంచి ప‌ని ఈ ఏడాది మార్చి వరకు నిరాటంకంగా కొన‌సాగుతుంది.

ఆ తర్వాత క్ర‌మంగా కార్యాల‌యాల‌కు వెళ్లడం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది చివ‌ర్లో అది బాగా పెరుగుతుంది. అయితే, 100 శాతం మంది కార్యాల‌యాల‌కు వెళ్లి పనిచేయడం అనేది ఉండక‌పోవ‌చ్చు. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో కాకుండా వేరే ప్రాంతాల నుంచి వ‌ర్క్ ఫ్రం హోం చాలా మంది చేస్తున్నారు.

వారంతా మళ్లీ ఇప్పటికిప్పుడు తమ కుటుంబాలతో హైద‌రాబాద్ కి రావడమ‌న్న‌ది సాధ్యం అయ్యే పని కాదు. వ‌ర్క్ ఫ్రం హోంలో ఉత్పాదకత చాలా అధికంగా ఉంది. 63 శాతం కంపెనీలు తమ సిబ్బంది ఉత్పాదకత 90 శాతానికి పైగా ఉన్నట్లు సర్వేలో తెలిపాయి. అంతేకాదు, కొన్ని పెద్ద కంపెనీల ఉత్పాద‌క‌త 100 శాతం ఉంది.

అయితే, వ‌ర్క్ ఫ్రం హోం వ‌ల్ల ఉద్యోగుల‌కు తగినంత బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. సైబర్‌ భద్రతా సమస్యలు కూడా ఉంటాయి.  ఇంట్లో కొంద‌రికి ప‌నికి త‌గ్గ‌ అనుకూలమైన వాతావరణం ఉండ‌డం లేదు. ఒక్కోసారి ఇంట్లో కరెంటు కోతలు వంటి స‌మ‌స్య‌లు ఉంటాయి. ప్రస్తుతం 31 శాతం కంపెనీలకు చెందిన 20 శాతం మంది ఉద్యోగులు మాత్ర‌మే కార్యాల‌యాలకు వెళ్లి పని చేస్తున్నారు.

55 శాతం కంపెనీల సిబ్బందిలో 5 శాతం మాత్రం మాత్రమే కార్యాల‌యాల‌కు వెళ్తున్నారు. ఒక‌వేళ తమ క్లయింట్లు అడిగితే ఉద్యోగుల‌ను ఆఫీసుకు పిలిచి పని చేయించాల్సి వస్తుందని కొన్ని పెద్ద కంపెనీలు చెప్పాయి. వ్యాక్సిన్ వ‌చ్చిన త‌ర్వాత కార్యాల‌యాల‌కు వ‌చ్చి ప‌నిచేయ‌డంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోతేనే కార్యాల‌యాల‌కు మ‌ళ్లీ సిబ్బందిని పూర్తి స్థాయిలో పిలుస్తామ‌ని సంస్థలు అంటున్నాయి.
surveywork from homeHyderabadCorona VirusCOVID19

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more